కాంగ్రెస్ డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం..

68
Congress

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన వచ్చిన (డిసెంబర్‌ 9) రోజును పురస్కరించుకుని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ ప్రారంభించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం జూన్‌ 26 వరకూ కొనసాగుతుందని తెలిపారు. అనంతరం స్థానిక రాజీవ్ చౌక్ వద్ద తమిళనాడులో బుధవారం హెలీకాప్టర్‌ కూలిన ఘటనలో కన్నుమూసిన త్రివిధ దళాల సమన్వయ అధికారి(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ రక్షణకు జీవితాన్ని అంకింతం చేసిన వారి సేవలు సదా స్మరణీయమన్నారు.