బీజేపీకి షాక్…లింగోజిగూడలో కాంగ్రెస్‌ గెలుపు

147
congress
- Advertisement -

తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలింది. హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్ధానాన్ని కొల్పోయింది బీజేపీ. బీజేపీ కార్పొరేటర్ మృతితో అనివార్యమైన ఎన్నికలో కాంగ్రెస్ సంచలన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దర్పేల్లి రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు.

మొత్తం 13,629 ఓట్లు పోల‌వ్వ‌గా, 13,340 ఓట్ల‌ను వ్యాలిడ్ ఓట్లుగా ప‌రిగ‌ణించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి 7,240 ఓట్లు, బీజేపీ అభ్య‌ర్థికి 5,968 ఓట్లు రాగా, నోటాకు 101 ఓట్లు వ‌చ్చాయి. 188 ఓట్లు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి.

ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రమాణస్వీకారం చేయకుండానే చనిపోయారు కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్. కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు పోటీచేయగా ఓటమి పాలయ్యారు.

- Advertisement -