- Advertisement -
ఏఐసీసీ తరహాలోనే తెలంగాణలో కూడా చింతన్ శిబిర్ నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. జూన్ మొదటి వారంలో ఈ కార్యక్రమం జరగనుండగా ఇందుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఛైర్మన్‌గా భట్టి విక్రమార్క వ్యవహరించనున్నారు.
కన్వీనర్ గా మహేశ్వర్ రెడ్డిని నియమించగా ప్రధానంగా ఆరు అంశాలపై చర్చించనున్నారు. క్షేత్ర స్ధాయికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లడం,రాజకీయం, వ్యవసాయం, ఆర్థిక అంశాలు, మహిళా శిశు సంక్షేమం, సామాజిక న్యాయంపై కమిటీ చర్చించనుంది. చింతన్ శిబిర్ నిర్వహణకు సంబంధించిన వేదికను తొందరలోనే ప్రకటించనున్నారు.
ఇప్పటికే రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మే 21న ప్రారంభించిన రచ్చబండను 30 రోజుల పాటు నిర్వహించనున్నారు. రానున్న 30 రోజుల్లో తెలంగాణలోని 12,000 గ్రామాలను కవర్ చేయనున్నారు.
- Advertisement -