చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా పహారా కాస్తున్న బడే భాయ్ పార్టీ బీజేపీ అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రజలకు ఎన్ని సమస్యలొచ్చినా రేవంత్ ఎన్ని స్కాములకు పాల్పడినా బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటది అన్నారు.
గ్రూప్ 1 నిర్వహణలో ఘోరమైన అవకతవకలు జరిగి ఏకంగా పరీక్షనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పినా రాష్ట్ర బీజేపీ కిమ్మనదు…విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం చేసిన నేరపూరిత నిర్లక్ష్యం మీద డబ్బులకు జాబులు అమ్ముకున్నారన్న ఆరోపణల మీద బీజేపీ మౌనానికి కారణమేంది? చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రతిదానికీ సీబీఐ ఎంక్వైరీ అని ఒంటికాలి మీద లేచిన బీజేపీ నేతలు గ్రూప్ 1 స్కాం మీద అదే విచారణ ఎందుకు కోరడం లేదు?,రేవంత్-బీజేపీల రహస్య మైత్రికి ఇది తాజా ఉదాహరణ మాత్రమే అన్నారు కేటీఆర్.
చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా
పహారా కాస్తున్న బడే భాయ్ పార్టీ బీజేపీ!రాష్ట్ర ప్రజలకు ఎన్ని సమస్యలొచ్చినా
రేవంత్ ఎన్ని స్కాములకు పాల్పడినా
బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటది.గ్రూప్ 1 నిర్వహణలో ఘోరమైన అవకతవకలు జరిగి ఏకంగా పరీక్షనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పినా… pic.twitter.com/XBIURh7g5W
— KTR (@KTRBRS) September 12, 2025
Also Read:కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా

