మాస్టర్ ప్లాన్..కాంగ్రెస్ బీజేపీ ఇంటర్నల్ దోస్తీ!

47
- Advertisement -

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. స్వలాభం కోసం చేతులు కలపడం, అసవరం తీరకా ఒకరినొకరు కత్తులు దూసుకోవడం కొన్ని రకాల పార్టీలకు షరామామూలే. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థి పార్టీలుగా కొనసాగుతున్న కాంగ్రెస్, బీజేపీ అంతర్గత మిత్రులనే సంగతి ఎంతమందికి తెలుసు ? పై పైకి నువ్వా నేనా అంట్లు కత్తులు దూసుకుంటున్నా లోలోపల మాత్రం ఇంటర్నల్ పొత్తు పొట్టుకొని ఒకరి అక్రమాలను ఒకరు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా కొద్ది మాత్రమే తెలుసు. ఆ మద్య నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ మరియు రాహుల్ గాంధీ పై పలు మార్లు విచారణ జరిగిన ఆ తరువాత ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియదు. .

ఇక తెలంగాణ విషయానికొస్తే ఈ రెండు పార్టీల మద్య ఉన్న పొత్తు ఇంకా స్పష్టంగా అర్థమౌతుంది. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కే‌సి‌ఆర్ సర్కార్ పై నమోదైన అక్రమ ఈడీ కేసులు అన్నీ ఇన్ని కావు. ఎన్నో రకాలుగా బి‌ఆర్‌ఎస్ నేతలను ఇరకారంలో పెట్టె ప్రయత్నం చేసిన బీజేపీ నేతల ఉడత ఊపులను దైర్యంగా ఎదుర్కొంటున్నారు బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్. కానీ కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన టి కాంగ్రెస్ నేతలపై మాత్రం ఇంతవరకు ఎలాంటి ఈడీ గాని సిబిఐ కేసులుగాని నమోదు కాలేదు. బీజేపీ నేతలు ఎన్ని అక్రమాలు చేస్తున్న వాటిని కప్పుపుచ్చుకోవడానికి ఈడీ కేసులు జరగలేదనుకుందాం కానీ కాంగ్రెస్ నేతలపై ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టడం లేదు.

కేవలం బి‌ఆర్‌ఎస్ నేతలే ఎందుకు టార్గెట్ అవుతున్నారు. ఈ ఒక్క అంశం చాలదా కాంగ్రెస్ బీజేపీ మద్య ఇంటర్నల్ పొత్తు వ్యవహారాన్ని బట్టబయలు చేయడానికి అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు విశ్లేషకులు. దేశాభివృద్దిని నాశనం చేయడంలో ఈ రెండు పార్టీల పాత్రే అధికం. అలాంటి ఈ రెండు పొత్తు పెట్టుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనేది కొందరు చెబుతున్నా మాట. అయితే దేశ రాజకీయాల్లో గాని, రాష్ట్ర రాజకీయాల్లో గాని ఈ రెండు పార్టీలను ఎండగట్టడమే లక్ష్యంగా బి‌ఆర్‌ఎస్ సమదూరం పాటిస్తోంది. దేశ ప్రజలకు బద్ద శత్రువుల్లా కనిపించే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు.. విలువలను పక్కన పెట్టి అంతర్గత పొత్తులు పెట్టుకున్నాయనేది జగమెరిగిన సత్యం. ఈ రెండు పార్టీలకు ఇటు రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రాజకీయ వాదులు చెబుతున్నా మాట.

Also Read:ప్రభాస్ సినిమాలో రాజమౌళి!

- Advertisement -