బీజేపీతో దోస్తీ.. రేవంత్ బయట పెట్టారా?

23
- Advertisement -

కాంగ్రెస్ మరియు భారత జనతా పార్టీ.. రెండు కూడా దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలుగా ముద్ర వేసుకున్నాయి. ప్రధాన పోరు కూడా ఈ రెండు పార్టీల మధ్యనే కొనసాగుతూ వస్తోంది. అయితే పైపైకి బద్ద శతృత్వం కలిగిన పార్టీలుగా ఉంటున్నప్పటికి లోలోపల సత్సంబంధాలు కొనసాగిస్తూ అంతర్గత పొత్తును అవలంభిస్తున్నట్లు బీజేపీ కాంగ్రెస్ పై తరచూ విమర్శలు వ్యక్తమవుతూనే ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ రెండు పార్టీల మద్య స్నేహాన్ని బి‌ఆర్‌ఎస్ నేతలు తరచూ బయట పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే గతంలో కే‌సి‌ఆర్ హయంలో తెలంగాణకు ఏ మాత్రం సహకరించని కేంద్ర ప్రభుత్వం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీనే అధికారంలోకి వచ్చినంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు కమలనాథులు.

గత బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ వ్యవహరించిన తీరు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తాజాగా తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సి‌ఎం రేవంత్ రెడ్డి స్వయంగా మోడికి స్వాగతం పలకడం, మోడిపై పొగడ్తలు కురిపించడం చూస్తే తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ బి టీంగా వ్యవహరిస్తుందా అనే సందేహాలు రాక మానవు. గత పదేళ్ళలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నట్లు జాతీయ నివేధికలు స్పష్టం చేస్తున్నాయి.

దాంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ మోడల్ లో కే‌సి‌ఆర్ పాలనను ఫాలో అయ్యే ప్రయత్నం చేశారు కూడా. కానీ ప్రస్తుతం సి‌ఎం రేవంత్ మోడి సమక్షంలో తెలంగాణలో గుజరాత్ మోడల్ పాలన జరగాలని, గుజరాత్ లో జరిగిన అభివృద్ధి తెలంగాణలో కూడా జరగాలంటే కేంద్ర సహకారం కావాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీకి కాంగ్రెస్ బి టీం అని స్పష్టమైందంటూ బి‌ఆర్‌ఎస్ పార్టీ ట్విట్టర్ లో విమర్శలు గుప్పిస్తోంది. మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ మద్య ఉన్న దోస్తీని సి‌ఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా బయట పెట్టారనేది కొందరి అభిప్రాయం.

Also Read:మెట్రో రెండో దశకు సీఎం రేవంత్ శంకుస్థాపన

- Advertisement -