కాంగ్రెస్ కు మరో తలనొప్పి ?

37
- Advertisement -

కాంగ్రెస్ ఈ మధ్య మంచి జోష్ లో ఉంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా పార్టీ బలాన్ని కోల్పోతూ వస్తున్న హస్తం పార్టీకి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు తిరిగి ఊపిరినిచ్చాయి. ఈ ఎన్నికల్లో లభించిన విజయం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. ఇక ఇదే జోష్ ను కొనసాగిస్తూ రాబోయే ఎన్నికలకు సమాయత్తం అవుతోంది హస్తం పార్టీ ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తరువాత వచ్చే ఏడాది ఎలాగూ పార్లమెంట్ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. దాంతో ఏడాది జరిగే మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలను హస్తం పార్టీ కీలకంగా తీసుకుంది.

అయితే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలలో ఇప్పటికే కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మిగిలిన తెలంగాణ, మిజోరాం వంటి రాష్ట్రాలలో స్థానిక పార్టీల హవా గట్టిగా ఉంది. అందువల్ల ఈ ఐదు రాష్ట్రాలలో సాధ్యమైనంత వరకు కనీసం మూడు చోట్ల విజయభేరి మోగించాలని కాంగ్రెస్ హైకమాండ్ దృఢ నిశ్చయంతో ఉంది. అయితే ప్రస్తుతం రాజస్తాన్ లో నెలకొన్న పరిస్థితులు ఆ పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం రాజస్తాన్ లో హస్తం పార్టీ అధికారంలో ఉన్నప్పటికి సి‌ఎం అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలెట్ మధ్య గత కొన్నాళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెంతలా వివాదం కొనసాగుతోంది.

Also Read: అమిత్ షాతో రెజ్లర్ల చర్చలు.. నో యూస్ !

వీరిద్దరి విషయంలో అధిష్టానం ఎన్నిసార్లు కలుగజేసుకొని సక్యత ఏర్పరిచే ప్రయత్నం చేసిన పెద్దగా ఫలితం లేకపోయింది. తాజాగా నేషనల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సచిన్ పైలెట్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట. ఇదే గనుక జరిగితే రాజస్తాన్ లో హస్తం పార్టీకి గట్టి దెబ్బే తగిలే అవకాశం ఉంది. రాజస్తాన్ రాజకీయాల్లో ప్రభావం చూపగల నేతల్లో సచిన్ పైలెట్ ఒకరు. ఆయనే పార్టీకి దూరమైతే కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలినట్లే. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఈ రకమైన వార్తలు కాంగ్రెస్ బలాన్ని బెబ్బ తీసే అవకాశం ఉంది. మరి రాజస్తాన్ లో ఇద్దరు బలమైన నేతల కారణంగా హస్తవ్యస్తంగా మారిన హస్తం పార్టీ పరిస్థితి ఎన్నికల ముందు ఎలా మారుతుందో చూడాలి.

Also Read: చేతివృత్తులకు భరోసా..లక్ష ఆర్థిక సాయం

- Advertisement -