Haryana: కొంప ముంచిన ఏడు గ్యారెంటీలు!

4
- Advertisement -

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు అని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో ఎదురుదెబ్బ తగిలింది.

తెలంగాణ, కర్ణాటక తరహాలో 7 గ్యారెంటీలు ప్రకటించింది. ఇవే కాంగ్రెస్ కొంపముంచాయి. ప్రతీ మహిళకు నెలకు 2000, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు నెలకు 6000,2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ,300 యూనిట్ల కరెంటు ఫ్రీ,పేదలకు 100 గజాల ప్లాట్ ,3.5 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 25 లక్షల ఆరోగ్య భీమా అని ప్రకటించినా ప్రజలు నమ్మలేదు.

తెలంగాణ, కర్ణాటకలో గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం కావడంతో హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు అన్నారు. 10 ఏండ్లు పాలించిన బీజేపీకే తిరిగి ప్రజలు పట్టం కట్టారు అన్నారు.

Also Read:‘దేవర 2’ ..ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

- Advertisement -