ఆరు గ్యారెంటీలు..ప్రజలకు ఎన్నో చిక్కులు!

46
- Advertisement -

ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీల అమలు వైపు కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తోంది. వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ అందుకు తగినట్టుగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీలో మార్పులు వంటి హామీలను అమలు చేయగా.. మిగిలిన హామీలను త్వరితగతంగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒకే దరఖాస్తు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన వారు ఒకే దరఖాస్తులో ఆరు గ్యారెంటీ హామీలకు ఆపై చేసుకోవచ్చు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ హామీల అమలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో అసహనానికి గురి చేస్తోంది. .

ఎన్నికల ముందు హామీల ప్రకటనలో ఎలాంటి షరతులు విధించిన కాంగ్రెస్.. గెలిచిన తర్వాత వాటి అమలులో పరిమితులు విధిస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులకు మాత్రమే ప్రయాణాన్ని పరిమితం చేసింది. అలాగే రూ.500 లకే వంటగ్యాస్ విషయంలో కూడా వైట్ రేషన్ కార్డ్ ఉన్నవారికే వర్తించేలా ప్లాన్ చేస్తోంది. ఇక మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇచ్చే హామీ విషయంలో కూడా షరతులు విధించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది.

రాష్ట్ర బడ్జెట్ దృష్ట్యా ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేయడం కష్టమని కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల వార్షిక ఆదాయం కలిగి వుండి, ఏ ఉద్యోగం లేని వారికి ఈ పథకాన్ని వర్తింపజేసే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో మహిళలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఆరు గ్యారెంటీ హామీలకు తెల్ల రేషన్ కార్డ్ ను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డు లేని వారికి ఆరు గ్యారెంటీలు లేనట్లేననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద హామీలను ప్రకటించి వాటి చుట్టూ ఎన్నో చిక్కులను సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీనిపై ముందు రోజుల్లో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Also Read:చలికాలంలో పెరుగు తినవచ్చా?

- Advertisement -