డౌట్స్ వద్దు.. అందరికీ లబ్ధి!

28
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేయబోతున్న ఆరు గ్యారెంటీ హామీల విషయంలో ఎన్నో సందేహాలను ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన వేళ.. ఇప్పటికే అమలు దిశగా గ్యారెంటీ హామీలకు ఒకే దరఖాస్తు ఫారం ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ దరఖాస్తు విషయంలో కూడా ఎన్నో సందేహాలు వ్యక్తమౌతూ వచ్చాయి. ఫారం లో రైతు భరోసా నగదు చెల్లింపులకు బ్యాంక్ వివరాలు లేకపోవడం, మహిళలకు నెలకు రూ.2500 చెల్లించే విషయంలో ఎంతమందికి చెల్లిస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడం, రూ.500 లకే గ్యాస్ విషయంలో ఏడాదికి ఎన్ని ఇస్తారనే దానిపై కూడా స్పష్టత లేకపోవడంతో అసలు ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ఎలా అమలు చేస్తుందనే సందేహాలు వ్యక్తమౌతు వచ్చాయి. .

మరికొందరైతే ఈ పథకాలన్ని నామమాత్రమే అని కొట్టి పారేస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో సి‌ఎం రేవంత్ రెడ్డి గ్యారెంటీ హామీల విషయంలో కొంత క్లారిటీ ఇచ్చారు. రైతు భరోసా, పెన్షన్ వంటి వాటిపై ఎలాంటి అపోహలు వద్దని పాత లబ్దిదారులందరికీ యథాతథంగా లభ్ది చేకూరుతుందని స్పష్టం చేశారు. కొత్తగా అప్లై చేసుకునే వారు మాత్రమే వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరి హామీలను ప్రకటించినట్టుగానే వాటి అమలుకు గట్టిగానే కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నిజంగానే ఆరు గ్యారెంటీ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తుందా లేదా అనేది చూడాలి.

Also Read:సీఎం రేవంత్‌తో బాలయ్య భేటీ

- Advertisement -