మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా రేవంత్ రెడ్డి

250
Revanth reddy
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాజకీయాలు హీటెక్కాయి. ప్రధాన పార్టీలు అభ్యర్దులను ఖరారు చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే అధికార టీఆర్ఎస్ ఎలాగైన 16 పార్లమెంట్ స్ధానాల్లో గెలుస్తామని గట్టి నమ్మకంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అయిన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్ధుల ఎంపీక విషయంలో తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించాల్సిన ఉన్నా కొన్ని మార్పులు చేర్పుల కారణంగా ఈనెల 15 తర్వాత తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే తాజాగా ఉన్న సమాచారం ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ గా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ఆయనను మహబూబ్ నగర్ నుంచి కాకుండా మల్కాజ్ గిరి పార్లమెంట్ స్ధానం నుంచి బరిలోకి దించాలని చూస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి విజయం సాధించిన సీతక్క కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. మహబూబాబాద్ పార్లమెంట్ స్దానం నుంచి సీతక్క బరిలోకి దించాలని చూస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. ఇటివలే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని..అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే బరిలోకి దిగుతానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.

- Advertisement -