కాంగ్రెస్ కు షాక్..బీజేపీలో చేరిన డీకే అరుణ

270
dk aruna bjp
- Advertisement -

లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో సీనియర్ నేత పార్టీని విడుతున్నారు. మహబూబానగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ కు గుబ్ బై చెప్పేశారు. బీజీపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆమెతో సుమారు 45నిముషాల పాటు మంతనాలు జరిపారు. అనంతరం బీజీపీ చీఫ్ అమిత్ షా తో ఫోన్ లో మాట్లాడించినట్టు తెలుస్తుంది.

ఆమె భవిష్యత్ పై స్పష్టమైన హామి ఇవ్వడంతోనే ఆమె పార్టీ మారుతున్నట్లు నిర్ణయించుకున్నారని సమాచారం. నిన్న సాయంత్రం ఆమె ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్టానంతో భేటి అయ్యారు.   అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్ధానం నుంచి ఆమెను పోటీ చేయించనున్నట్లు సమాచారం. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేసి ఆమె ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అరుణ అనూహ్య నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరడం సొంతపార్టీ నేతలను కలవరపరుస్తోంది. ఏదిఏమైనా డీకే అరుణ పార్టీ వీడటం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ అని చెప్పుకోవాలి.

- Advertisement -