రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పుః కాంగ్రెస్ (వీడియో)

287
Rahul Gandhi
- Advertisement -

ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపణలు చేసింది ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్. ఇటీవల తన స్వంత నియోజవకర్గం అమేథీలో రాహుల్ పర్యటించిన సందర్భాల్లో ఆయన మాట్లాడుతుండగా ఓ లేజర్ కాంతికిరణం ఆయన నుదుటిపై ఫోకస్ అయినట్టు వీడియోల్లో కనిపించింది. అమేథీ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ భద్రతలో లోపాలు తలెత్తినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు కాంగ్రెస్ నేతలు.

పలు సందర్భాల్లో ఇలా 7 సార్లు ఫోకస్ అయినట్టు గుర్తించారు. ఖచ్చితంగా రాహుల్ నుదుటిని టార్గెట్ చేసుకునే క్రమంలో లేజర్ కాంతి ఆయన ముఖంపై అటూ ఇటూ కదులుతున్నట్టుగా వీడియోల్లో రికార్డయింది. ఏప్రిల్ 10న రాహుల్ గాంధీ 2019 లోక్ సభ ఎన్నికల్లో తన నామినేషన్ వేసేందుకు అమేథీకి వచ్చారు.

నామినేషన్ వేసిన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతుండగా ఆ లేజర్ కాంతి రాహుల్ నుదిటిపై గురిపెట్టినట్టు కాంగ్రెస్ లేఖలో పేర్కొంది. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వీడియో ఉన్న ఓ పెన్ డ్రైవ్ ని లేఖతో సమర్పించింది. లేజర్ కాంతి రాహుల్ గాంధీ నుదుటిపై గురిపెట్టి ఉందని లేఖలో తెలిపింది. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు తప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కోరింది.

- Advertisement -