డాక్టర్ సాయిపల్లవి…

401
saipallavi-
- Advertisement -

స్క్రీన్‌పై సాయిపల్లవి చలాకీతనం చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. తెరపై ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అంతలా కట్టిపడేస్తాయి. ప్రేమమ్‌తో తెరంగేట్రం చేసిన ఈ టాలెంటెడ్ గర్ల్.. అనతి కాలంలోనే అటు తమిళ, మలయాళ.. ఇటు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఫిదా సినిమాతో ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. అచ్చమైన తెలంగాణ యాసలు అద్భుత రీతిలో డైలాగులు చెబుతూ తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది సాయిపల్లవి.

saipallavi

అయితే ఇప్పుడు సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వార్త తెగ హల్‌ చల్‌ చేస్తోంది. సాయిపల్లవిది తమిళనాడు సరిహద్దుల్లోని కోటగిరి అనే ఓ చిన్న పల్లెటూరట. ఆమె తల్లి కస్టమ్స్ ఆఫీసరట. సాయిపల్లవి తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలట. అందుకే ఆమె పేరు సాయిపల్లవి అని పెట్టారట. ఇక అన్నింటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే సాయిపల్లవి కవల పిల్లల్లో ఒకరట. ఆమె తన చెల్లెలు పూజతో కలిసి ఒకేసారి పుట్టిందట. 12వ తరగతి పూర్తి చేశాక ‘ఢీ’ డ్యాన్స్ షోకు అప్లై చేశానని.. అందులో ప్రతిభ చాటుకున్నాక తాను సినిమాల వైపు వెళ్లిపోతాననే భయంతో తన తండ్రి మెడిసిన్ కోసం జార్జియాకు పంపించేశారని తెలిపింది సాయిపల్లవి. ఒక డాక్టర్ గా ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చానని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

- Advertisement -