టీకాంగ్రెస్ ఇంఛార్జ్‌గా మాణిక్ రావ్..

21
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న మాణికం ఠాగూర్‌ని గోవా ఇంఛార్జీగా నియమించగా తెలంగాణకు మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావ్ థాక్రేను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు మాణిక్ రావ్. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. పార్టీని నడిపించిన నాయకుడిగా అనుభవం ఉండటంతో తెలంగాణ వ్యవహారాలు చూసేందుకు ఎంపిక చేసింది.

ప్రస్తుతం రేవంత్ వర్గానికి, సీనియర్లకు మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. రేవంత్ వర్గానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు పని చేస్తుండగా అందరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కొత్త ఇంఛార్జీ చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి..

ఇవి కూడా చదవండి..

- Advertisement -