వెంటాడిన‌ ప్రమాదాలు..

19
- Advertisement -

రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. అయితే ఆమెను వరుస ప్రమాదాలు వెంటాడాయి.ఎమ్మెల్యే గా కాలం కలిసిరాలేదు. లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడింది.

తర్వాత నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి‌ ప్రమాదానికి గురైంది. మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువ‌ ఎమ్మెల్యే మృతి చెందారు. నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందగా లాస్య నందితకు తీవ్రగాయాలు అయ్యాయి.

పది రోజులు గడువక‌ ముందే మరో రోడ్ ప్రమాదం చోటచేసుకుంది. ఓఆర్ఆర్ వద్ద డివైడర్ ను ఢీ కొని కారు పల్టీలు కొట్టింది. తండ్రి సాయన్న ఆశయాలు‌ నెరవేర్చకుండానే తండ్రి వద్దకి చేరుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read:ఆ రెండు గ్యారెంటీలు..ఎప్పటినుంచి అంటే?

- Advertisement -