అధిక ఛార్జీల వసూలు…ఇద్దరు కండక్టర్లపై కేసు

409
nalgonda police
- Advertisement -

ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుండగా మరోవైపు టికెట్ కన్నా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వారిపై కొరఢా ఝుళిపించారు పోలీసులు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో టికెట్ రేటు కన్నా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఇద్దరు కండక్టర్లపై 420 కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ రంగనాథ్ నార్కట్ పల్లి బస్టాండ్ లో బస్సుల రాకపోకలను పరిశీలించారు. బస్సుల్లోకి వెళ్లి ఎంత ఛార్జీ తీసుకుంటున్నారని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అసలు ధర కంటే ఎక్కువగా వసూలు చేశారని ప్రయాణికులు చెప్పడంతో ఆయన సీరియస్ అయ్యారు.

యాదగిరిగుట్ట డిపో కండక్టర్ రామాంజనేయులు, ఖమ్మం డిపో కండక్టర్ నాగేశ్వరరావుపై పోలీసులు 420 కేసులు నమోదు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా టికెట్ రేటు కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోవద్దని ప్రభుత్వం సిబ్బందికి తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు.

- Advertisement -