కాళేశ్వరం స్ఫూర్తితో పనులు సాగాలె: సీఎం కేసీఆర్‌

177
cm kcr
- Advertisement -

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాలని, కృష్టా బేసిన్ లోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాల పనులను సంపూర్ణంగా పూర్తి చేయాలని. ఇరిగేషన్ అధికారులు పూర్తిస్థాయి నిబద్ధతతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ అధికారులను కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల పురోగతిపై, పనులను మరింత వేగవంతం చేయడంపై, సీఎం ప్రగతి భవన్ లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మహబూబ్ నగర్ నీటి గోసను, నల్లగొండ ఫ్లోరైడ్ కష్టాలను ప్రస్తావించకుండా నా ప్రసంగం సాగలేదు. నాటి పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను కావాలనే పెండింగులో పెట్టినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆన్ గోయింగ్ పెండింగు ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నం. ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు కొందరు కోర్టుల్లో కేసులేసి స్టేల ద్వారా అడ్డుపడుతున్నరు. అయినా పట్టుదలతో పనులు చేసుకుంటూ వస్తున్నం అన్నారు.

జూరాలతో సహా ఇప్పటికే కల్వకుర్తి నెట్టెంపాడు భీమా వంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుని దక్షిణ పాలమూరుకు చెందిన 11లక్షల ఎకరాలను పచ్చగా చేసుకున్నం అని సీఎం అన్నారు. ఇంకా వాటిల్లో కొరవలు (కొసరు పనులు) మిగిలినయి. వాటిని ఎట్లా అతి త్వరలో పూర్తి చేసుకుందామనే ఆలోచన చేయాలె. కాళేశ్వరం స్ఫూర్తితో పనులు సాగాలె. ఏది ఏమయనా సరే, పాలమూరు ఎత్తిపోతల పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

- Advertisement -