సమగ్ర కుటుంబ సర్వేపై ఫిర్యాదులు!

1
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం కులగణన కోసం సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రకుటుంబ సర్వే ప్రారంభం కాగా ఫిర్యాదులు అందాయి. బీసీ – బీ జాబితాలో 84 కులాలకు కోడ్​లను కేటాయించారు. కానీ వాటిలో విశ్వబ్రాహ్మణ కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించాలని ఈ సామాజిక వర్గానికి చెందిన వారు కోరారు. కులం ఉన్న చోటనే విశ్వబ్రాహ్మణ అని, వృత్తి ఏదైతే అది అక్కడ నమోదు చేసేలా మార్పులు చేయాలన్నారు.

ఆదిలాబాద్​ జిల్లాలో పరదాన్​ కులస్థులు ఎస్టీ జాబితాలో ఉన్నారు. కానీ సర్వే వివరాల్లో మాత్రం పరదాన్ కులానికి ప్రత్యేక కోడ్​ లేదని, ఇతరులు అని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పలు కుటుంబాలు తమ స్వగ్రామంలో ఇల్లు ఉన్నా, చదువు, ఉద్యోగం, వ్యాపార రీత్యా నగరాలు, సమీప పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. ఇలాంటి వారు ఎక్కడ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఆదిలాబాద్​ జిల్లా అధికారులు మాత్రం ఆధార్​ కార్డులో ఎలా చిరునామా ఉంటే అక్కడ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. కానీ ప్రణాళిక శాఖ అధికారిని ఈ విషయంపై అడగ్గా ప్రజలకు సులభంగా ఉండేలా ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయి. ఎన్యూమరేషన్​ బ్లాక్​లుగా 87,092 ఇళ్లను విభజించగా ఇందులో గ్రేటర్​ హైదరాబాద్​లోనే మొత్తం 28,32,490 కుటుంబాలు నివాసం ఉండగా, వాటిని 19,328 ఎన్యూమరేషన్​ బ్లాక్​లుగా విభజించారు. మొత్తం సర్వే పూర్తి చేయడానికి 94,750 మందిని, వారిపై 9,478 మంది సూపర్​వైజర్లను ప్రభుత్వం నియమించింది.

Also Read:యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌..రోటి కపడా రొమాన్స్‌

- Advertisement -