సాహో నిర్మాతలపై కేసు నమోదు..!

499
- Advertisement -

సాహో సినిమా నిర్మాతలపై పోలీస్ ఫిర్యాదు చేశారు బెంగుళూరుకు చెందిన ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు. సాహో నిర్మాతలైన యూ.వీ. క్రియేషన్స్ తమ సంస్థ పేరున్న లగేజీ బ్యాగులను సినిమా సన్నివేశాలలో ప్రదర్శిస్తామని నమ్మించి దాదాపు 1 కోటి 40 లక్షల రూపాయల వరకు మోసం చేసారంటూ ” ఆర్క్ టిక్ ఫాక్స్ లగేజీ బ్యాగ్స్ తయారీ సంస్థ ఆరోపించింది. ఇందుకుగాను సాహో నిర్మాతలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ మార్కెటింగ్ హెడ్ విజయ్ రావు ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

saaho

ఈ కంప్లయింట్ పై మాదాపూర్ సీఐ వెంకట్ రెడ్డి స్పందించారు. ఔట్ షైనీ అనే కంపెనీ బ్యాగ్ ను సాహో సినిమాలో వాడుతామని చెప్పి మోసం చేశారంటూ కంప్లయింట్ వచ్చిందన్నారు. ఆర్కిటిక్ ఫాక్స్ బ్యాగ్ ను సాహో సినిమాలో హీరో, హీరోయిన్ చేత ప్రమోట్ చేస్తామని యూవీ క్రియేషన్స్ అగ్రిమెంట్ చేసుకుందన్నారు. న్యాయ సలహాలు తీసుకుని కేసులో విచారణ చేస్తామని చెప్పారు.

Complaint against on saaho producers

- Advertisement -