మా భూమిలోకొచ్చి అనవసర రాద్ధాంతం చేస్తున్న భూ కబ్జా దారులు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ల వారిపై చర్యలు తీసుకోవాలి….ఓ వెంచర్ లో ప్లాట్స్ కొన్న అసోసియేషన్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కి వినతిపత్రం అందించారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని చర్ల పటేల్ గూడా గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలో పెద్ద చెరువు ప్రక్కన గల ఎఫ్టిఎల్ భూములలో కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది.సర్వే నెంబర్ 1371,1372,1392 432 లేక్ విల్లా అర్చిడ్స్ వెంచర్స్లో తాము 2001 లో ప్లాట్స్ కొనుగోలు చేసాము వెంచర్ కూడా అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ గా మార్చుకున్నాము అయితే 2016 నుండి మాకు భూమి అమ్మిన వారికి రైతు బండ్ డబ్బులు పడడంతో ,భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతుండడంతో అత్యాశతో కొంతమంది రైతులు కలిసి ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ల తో చేతులు కలుపుకొని మా ప్లాట్స్ తో పాటు మిగతా భూమిని అక్రమంగా రాత్రికి రాత్రి మొత్తం దున్ని వ్యవసాయ బూమిగా మార్చి అగ్రికల్చర్ భూమిగా పర్మిషన్ తీసుకొచ్చి మా భూమిని లాక్కున్నారని లేక్ విల్లా అర్చిడ్స్ ప్లాట్స్ ఓనర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ భూమి మా భూమి అని కొందరు ఆరోపిస్తున్నారు.కౌన్సిలర్లు మా భూమిని కబ్జా చేసి యథేచ్ఛగా వ్యవసాయo చేస్తున్నారని మేము ఆక్కడికి వెళ్తే భయాందోళనకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు ఈ భూమి వివాదాస్పదంగా మారింది.ప్లాట్ ఓనర్ ప్రభాకర్ మాట్లాడుతూ గత కొంతకాలం గా తీసుకున్న మా ప్లాట్స్ లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగిందని, కాని ప్రస్తుతం కొంతమంది కౌన్సిలర్లువచ్చి,ఇది మా భూమి మేము కొన్నామని తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు డాక్యుమెంట్లు పూర్తిగా పరిశీలించి మా భూమి ని మాకు దక్కేలా చూడాలని కోరుతున్నారు ఈ విషయం పై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ర్ రెడ్డి ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చామని అలాగే కలెక్టర్ కూడా కలిసి భూ కబ్జా దారుల నుండి మా భూమి మాకు వచ్చేలా చూడాలని వేడుకుంటున్నామన్నారు..