చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..

72
- Advertisement -

చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వివిధ కమ్యూనిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. చిన్న జీయర్‌మి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలను నిరసిస్తూ ట్యాంక్బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. బికేఎమ్‌యు, డిహెచ్‌పిఎస్, టిజిఎస్ఎన్ఏఫ్‌,ఏఎస్ఎఫ్ ఐ, ఏఐవైఎఫ్ ల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సమాఖ్య జాతీయ కార్యదర్శి అజయ్ నాయక్ రామావత్ మాట్లాడుతూ… ఆయా జంతువుల మాంసం సేవించేవారు అలాంటి జంతువుల స్వభావాలు కలిగి ఉంటారని చిన్న జీయర్ స్వా మి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగాఖండిస్తున్నామన్నారు. చిన్నజీయర్ స్వామి ప్రజల సమక్షంలో క్షమాపణలు చెప్పాలని లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -