ఉమ్మడి వ్యూహం..ఉమ్మడి మేనిఫెస్టో?

53
- Advertisement -

ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరువాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనూహ్యంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. టీడీపీ జనసేన మద్య పొత్తు అంశం ఎప్పటి నుంచో చర్చకు వస్తున్నప్పటికి అటు పవన్ గాని ఇటు చంద్రబాబు గాని అధికారికంగా ఎప్పుడు కన్ఫర్మ్ చేయలేదు. కానీ చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత జైల్లో మూలఖత్ జరిపిన పవన్ బయటకు వచ్చి ఊహించని విధంగా పొత్తు ప్రకటించారు. దీంతో అసలు మూలఖత్ లో చంద్రబాబు పవన్ తో ఏం చర్చించారు ? ఏం సూచించారు ? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తెగ చక్కర్లు కొట్టాయి. .

అయితే రెండు పార్టీల ఉమ్మడి సి‌ఎం అభ్యర్థిగా పవన్ ఉండేందుకు చంద్రబాబు ఒప్పుకున్న తరువాతనే పవన్ పొత్తు కన్ఫర్మ్ చేశారనేది కొందరి అభిప్రాయం. ఇందులో ఎంతో కొంత నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో చెప్పలేని పరిస్థితి అలాగే నారా లోకేశ్ అరెస్ట్ కు కూడా రంగం సిద్దమౌతోంది. అందుకే పవన్ రెండు పార్టీల సి‌ఎం అభ్యర్థిగా చంద్రబాబు ఒప్పుకున్నట్లు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అందుకే ఇకపై అటు పవన్ గాని ఇటు టీడీపీ శ్రేణులు గాని తీసుకునే ప్రతి నిర్ణయాలు రెండు పార్టీలకు సంబంధించినవిగా ఉండాలనే ప్లాన్ లో ఉన్నారట.

Also Read:మైనంపల్లి ఎఫెక్ట్.. కాంగ్రెస్ కు బిగ్ షాక్?

త్వరలో పవన్ వారాహి యాత్ర నాలుగో విడత ప్రారంభం కానుంది. ఈ యాత్రలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నారట. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజా హామీల విషయంలో రెండు పార్టీలు ఒకే నిర్ణయంతో ముందుకు సాగే ఆలోచనలో ఉన్నట్లు టాక్. అందులో భాగంగానే టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సిద్దమౌతున్నారట నేతలు. అయితే ఇప్పటికే మినీ మేనిఫెస్టో పేరుతో టీడీపీ కొన్ని హామీలను ప్రకటించింది. మరి వాటిని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉందా లేదా అనే దానిపై ముందు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి టీడీపీ జనసేన యొక్క ఈ ఉమ్మడి వ్యూహం.. ఉమ్మడి మేనిఫెస్టో ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి.

Also Read:చేపనూనె వాడితే ప్రమాదమా ?

- Advertisement -