కమిటీ కుర్రోళ్లు..విజయోత్సవ వేడుక

9
- Advertisement -

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ఈ మూవీ ఆగస్ట్ 9న విడుదలైంది. చిత్రానికి అద్భుతమైన ఆదరణ దక్కింది. ఇంత భారీ విజయాన్ని ఆడియెన్స్ అందించడంతో శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో..నిహారిక మాట్లాడుతూ.. ‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. మా చిత్రాన్ని రమేష్ గారు భుజానికెత్తుకుని నడిపించారు. పెట్టిన ప్రతీపైసా తెరపై కనిపిస్తుందని అంతా అంటున్నారు. వంశీ గారు మా అందరినీ నమ్మి సినిమాను రిలీజ్ చేసినందుకు థాంక్స్. అంకిత్ కొయ్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. కథ వినమని అన్నాడు. వంశీ కథను వినాలని తీసుకున్నదే ది బెస్ట్ నిర్ణయం. నాకంటే ఎక్కువగా అంకిత్, రమేష్ గారు ఈ కథను నమ్మారు. మాతో పాటు సపోర్ట్‌గా నిలిచిన అంకిత్‌కు థాంక్స్. మంచి చిత్రాన్ని తీస్తే సరిపోదు. అది జనాల వరకు వెళ్లాలి. అలా జనాల వరకు తీసుకెళ్లిన మీడియాకు థాంక్స్. ఇది పీపుల్స్ సినిమా అయింది. ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే జనాలే కౌంటర్లు ఇస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు మా అందరికీ గర్వంగా ఉంది’ అని అన్నారు.

నిర్మాత జయ అడపాక మాట్లాడుతూ..‘మా కమిటీ కుర్రోళ్లు చిత్రానికి మీడియా ముందు నుంచీ సపోర్ట్‌గానే ఉంటోంది. మంచి కంటెంట్‌తో ముందుకు వస్తే ఆదరిస్తామని తెలుగు ఆడియెన్స్ మళ్లీ నిరూపించారు. సినిమాను హిట్ చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్. టీంకు కంగ్రాట్స్’ అని అన్నారు.

దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.. ‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాలుగేళ్ల క్రితం ఈ ప్రయాణం మొదలైంది. సక్సెస్ అనే పదం వినడానికి మూడున్నరేళ్లు పట్టింది. కమిటీ కుర్రోళ్లు సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రావడానికి నిహారిక గారు, పద్మజ గారు.. జయ గారు కారణం. వీళ్లే మా సక్సెస్‌కు కారణం. నిహారిక గారు చాలా స్ట్రాంగ్ ఉమెన్. ఈ సినిమాను నిర్మించేందుకు చాలా మంది భయపడ్డారు. కానీ నిహారిక గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ మూవీని చూసిన వాళ్లు మలయాళీ చిత్రమని అంటున్నారు. కానీ నిహారిక లాంటి నిర్మాతలు ఉంటే.. ఇలాంటి చిత్రాలు తెలుగులోనే ఇకపై వస్తాయి. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా ఫ్యామిలీ, బ్రదర్స్‌కు థాంక్స్. దీపక్ సరోజ్, అంకిత్ కొయ్యలకు థాంక్స్. కమిట్మెంట్ ఉన్న టీం నాకు దొరికినందుకు ఎంతో అదృష్టవంతుడ్ని. నేను రాసుకున్న దాని కంటే.. చాలా ఎక్కువగా చూపించారు రాజు. ఆయన కెమెరా పనితనం, ఫ్రేమింగ్, లైటింగ్ అద్భుతంగా వచ్చింది. రాజు గారితో మళ్లీ సినిమా చేయాలని ఉంది. అన్వర్ గారు పూర్తిగా మాతోనే ఉండి.. ప్రతీ ఫ్రేమ్‌ని అద్భుతంగా ఎడిట్ చేశారు. జేడీ మాస్టర్ చివరగా టీంలోకి వచ్చినా.. పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశారు. విజయ్ మాస్టర్ గారి ఫైట్స్, ఇంటర్వెల్ బ్లాక్ గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. డీటీఎస్ మిక్సింగ్ రాధా కృష్ణ, సాయి మణిందర్ గారి సౌండింగ్‌కు ప్రశంసలు వస్తున్నాయి. సుభాష్, కొండల్రావ్ రైటింగ్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రణయ్ నయని, విష్ణు ప్రొడక్షన్ డిజైనింగ్ వల్లే మూడు జనరేషన్స్‌ని తెరపై చూపించాం. నా డైరెక్షన్ టీంకు థాంక్స్. వాళ్లంతా చాలా కష్టపడ్డారు. భూపాల్ రావు, సిరి క్యాస్టూమ్స్‌లో తేడా చూపించారు. మూడు జనరేషన్స్‌లోని తేడాని చూపించారు. అనుదీప్ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారంటే నాకు ఎంతో ఆనందమేసింది. ప్రతీ ఒక్క పాత్రకు.. ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. మూడేళ్ల పాటు వీళ్లంతా నాతోనే ఉన్నారు. వాళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. ఈ క్రెడిట్ అంతా వీళ్లదే. పాత్ర చిన్నదే అయినా లేడీ ఆర్టిస్టులు అద్భుతంగా చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు లేకపోతే ఈ సినిమా ఇలా వచ్చి ఉండేది కాదు. సినిమా తీయడం గొప్ప కాదు.. మా అందరినీ ఎంకరేజ్ చేసే నిర్మాతలే గొప్ప. మమ్మల్ని నమ్మి ఇంత డబ్బులు పెట్టిన నిర్మాతలకు థాంక్స్. మా అందరినీ ఎంకరేజ్ చేస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

Also Read:గూగుల్ హెడ్ ఆఫీస్‌లో సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -