కమిటీ కుర్రోళ్ళు…లిరిక‌ల్

17
- Advertisement -

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ప‌క్కా ప్లానింగ్‌తో మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయ‌టం ఇక్కడ విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి జాతర పాటను రిలీజ్ చేశారు.

సందడి సందడి అంటూ సాగే ఈ పాటను సింహాచలం మన్నెల రచించగా.. అనుదీప్ దేవ్, రేణూ కుమార్, శ్రీనివాస్ దరిమిశెట్టి ఆలపించారు. అనుదీప్ దేవ్ మంచి ఊపునిచ్చే బాణీని అందించారు. ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్, జాతర సన్నివేశాలు, కుర్రాళ్ల ధూంధాం స్టెప్పులు బాగున్నాయి.

రాజు ఎడురోలు ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేశారు. ఈ చిత్రానికి వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల సంభాషణలు రాశారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.

Also Read:Sachin:అండర్సన్‌కు విషెస్ చెప్పిన సచిన్

- Advertisement -