నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో..
సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘నన్ను పిలిచి ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగమయ్యేలా చేసిన నిహారిక గారికి థాంక్స్. ఇది చిన్న చిత్రం కాదని అర్థమైంది. అసలు చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. ఎక్కువ ఖర్చు పెడతామంతే. ఇది చాలా పెద్ద బడ్జెట్‌తో తీసిన పెద్ద సినిమాలా కనిపిస్తోంది. విజువల్స్ బాగున్నాయి. ఇలా కొత్త వారితో ఇంత మంచిగా చిత్రాన్ని తీయడం అంటే మామూలు విషయం కాదు. యదు గారికి ఇది మొదటి సినిమాలా అనిపించడం లేదు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నిహారిక గారు మల్టీ టాలెంటెడ్. నటిస్తున్నారు.. నిర్మిస్తున్నారు.. షోలు చేస్తున్నారు. ఆమెకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి భారీ లాభాల్ని తెచ్చి పెట్టాలి. ఇలాంటి మంచి చిత్రాలు వస్తే ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు.. పెద్ద హిట్ చేస్తారు’ అని అన్నారు.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘షూటింగ్ ఉన్నా కూడా పిలిచిన వెంటనే వచ్చిన సిద్దు గారికి థాంక్స్. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు లేకపోతే సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. టీం అంతా కలిసి కష్టపడి సినిమా చేశాం. మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరూ బెస్ట్ ఇచ్చారు. అందరికీ థాంక్స్. కమిటీ కుర్రోళ్ళు అంతా కూడా మూడేళ్లు సినిమా కోసం పని చేస్తూనే ఉన్నారు. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన సిద్దు గారికి థాంక్స్. మా సినిమాలో నటించిన 11 మంది కూడా సిద్దు గారిలానే ఎంతో కష్టపడుతుంటారు. మా టెక్నికల్ టీం సపోర్ట్ వల్లే సినిమాను ఇంత బాగా తీయగలిగాను. సినిమా చూస్తే చాలా రీఫ్రెష్‌గా, నోస్టాల్జిక్‌గా అనిపిస్తుంది. నిహారిక గారు, ఫణి గారు లేకపోతే మూవీని ఇంత బాగా తీసేవాళ్లం కాదు. రమేష్ గారు మాకు ఎంతో అండగా నిలిచారు. మేం మంచి చిత్రాన్ని తీశాం. ఆగస్ట్ 9న మా సినిమా థియేటర్లోకి రానుంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ.. ‘మా కమిటీ కుర్రోళ్లు టీంకు కంగ్రాట్స్. చాలా మంచి చిత్రాన్ని తీశాం. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్. మా ఈవెంట్‌కు వచ్చిన సిద్దు గారికి థాంక్స్. ఎమోషనల్ క్యారీ అయ్యేట్టుగా.. అనుకున్నది అనుకున్నట్టుగా యదు సినిమాను తీశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
Also Read:రివ్యూ: పురుషోత్తముడు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. యదు గారు మంచి సినిమాను తీశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో మంచి యూత్ ఫుల్ సినిమాను తీశారు. ఇలాంటి సినిమాకు సిద్దు గారిలాంటి హీరో గెస్టుగా రావడం ఆనందంగా ఉంది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. చూసి అందరూ సక్సెస్ చేయాలి’ అని అన్నారు.