క‌మిట్‌మెంట్ టీజ‌ర్ లాంచ్‌!

230
commitment
- Advertisement -

తేజ‌స్వి మ‌డివాడ, అన్వేషి జైన్, ర‌మ్య ప‌సుపిలేటి‌, సూర్య శ్రీనివాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం క‌మిట్ మెంట్‌. ల‌వ్, డ్రీమ్,హోప్‌, ఫైట్ అనే నాలుగు భిన్న‌మైన స్టోరీల‌తో ఈ చిత్రం సాగుతుంది.

హైద‌రాబాద్ న‌వాబ్స్ ఫేం ల‌క్ష్మీకాంత్ చెన్నా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ర‌చ‌న మీడియా వ‌ర్క్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో ఎఫ్3 ప్రొడ‌క్ష‌న్, ఫూట్ లూస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై బ‌ల్‌దేవ్‌సింగ్‌, నీలిమ. టి నిర్మిస్తున్నారు. ఈ రోజు హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల కార్య‌క్ర‌మంలో క‌మిట్ మెంట్ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. న‌లుగురు మ‌హిళ‌ల జీవితంలోకి పురుషులు ఎంట‌రైన త‌ర్వాత వారి జీవితాల‌పై క‌మిట్ మెంట్ ప్ర‌భావం ఎలా ప‌డిందనేది సినిమాలో చూపించ‌నున్న‌ట్టు టీజ‌ర్ ను చూస్తే అర్త‌మ‌వుతుంది. రొమాంటిక్ గా సాగుతూనే మ‌రోవైపు ఆడ‌పిల్ల‌లు క‌న‌బ‌డితే క‌మిట్‌మెంట్లు, కాంప్ర‌మైజ్‌లు త‌ప్ప ఇంకేమి ఆలోచించ‌రా అంటూ తేజ‌స్వి చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా..తేజ‌స్వి మ‌డివాడ మాట్లాడుతూ – ప్ర‌తి యాక్ట‌ర్ కెరీర్‌లో కొంత స్ట‌గులింగ్ స్టేజ్ ఉంటుంది. నేను కూడా అలాంటి స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు ఈ అవ‌కాశం నా ద‌గ్గ‌ర‌కు రావ‌డం జ‌రిగింది. మ‌ళ్లీ నాకు సినిమాల‌పై ఇంట్ర‌స్ట్ రావ‌డానికి ల‌క్ష్మీకాంత్ చెన్నా నే కార‌ణం. ఆయ‌న చెప్పిన స‌బ్జెక్ట్ నాకు అంత‌గా క‌నెక్ట్ అయ్యింది. ఇది కేవ‌లం స్క్రిప్ట్ మాత్ర‌మే కాదు ప్ర‌తి అమ్మాయి లైఫ్ స్టోరీ అనేంత‌లా రియ‌లెస్టిక్ గా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీలో కొంత బోల్డ్‌గానే న‌టించ‌డం జ‌రిగింది అయితే కేవ‌లం రొమాంటిక్ పిక్చ‌ర్ గానే కాకుండా మంచి సందేశాత్మ‌క చిత్రంగా కూడా ఉంటుంది అన్నారు.అన్వేషి జైన్ మాట్లాడుతూ – ఈ సినిమాలో తెలుగు వాళ్ల‌తో క‌లిసి వ‌ర్క్‌చేయ‌డం ఒక మంచి ఎక్స్‌పీరియ‌న్స్ . ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ చాలా డెడికేష‌న్ మరియు ప్యాష‌న్‌తో ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ మూవీ చేశారు. అన్ని అంశాలు క‌ల‌గ‌లిపి ఈ సినిమా ఒక రోల‌ర్‌కోస్ట‌ర్ రైడ్‌లా ఉంటుంది. ప్ర‌స్తుత స‌మాజంలో జ‌రుగుతున్న విష‌యాల గురించి ఈ సినిమాలో చ‌ర్చించ‌డం జ‌రిగింది. మ‌న‌కు అందంగా అనిపించే ప్ర‌తి దాంట్లో ఒక అపాయం ఉంటుంది అని ఈ సినిమాలో చూపించ‌డం జ‌రిగింది. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.

ద‌ర్శ‌కుడు లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ – గ‌తేడాది అక్టోబ‌ర్‌లో షూటింగ్ స్టార్ట్ చేశాం. ఈ ఏడాది అక్టోబ‌ర్ లో షూటింగ్ పూర్తిచేశాం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ ‌ జ‌రుగుతున్నాయి. టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మీ అంద‌రికీ కూడా న‌చ్చుంద‌నే అనుకున్నాను. ఈ టైటిల్ చూసి చాలా మంది సినీ ప్ర‌ముఖులు ఈ ఈవెంట్‌కి రాలేదు. అయినా మాకు మీడియా స‌పోర్ట్ ఉంటుంద‌నే న‌మ్మ‌కంతో మా టీమ్ అంద‌రం క‌లిసి టీజ‌ర్ లాంచ్ చేయ‌డం జ‌రిగింది. త్వ‌ర‌లోనే విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. అన్ని ఇండ‌స్ట్రీల‌లో అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ విష‌యాన్నే ఈ సినిమాలో చూపించ‌డం జ‌రిగింది. ఎదో స్కిన్ షో చేసి అమ్ముకోవాల‌ని ఈ సినిమా చేయ‌లేదు. క‌థ‌ని బ‌లంగా న‌మ్మి ఈ సినిమా చేశాను. మీ అంద‌రి స‌పోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత బ‌ల్‌దేవ్‌సింగ్ మాట్లాడుతూ – ` అనిల్ గారితో క‌లిసి ఈ సినిమా నిర్మించ‌డం జ‌రిగింది. ద‌ర్శ‌కుడు లక్ష్మీకాంత్ చెన్నా అద్బుతంగా ఈ సినిమాని తెర‌కెక్కించారు. ప్ర‌తి ఒక్క‌రూ చ‌క్క‌గా న‌టించారు. త‌ప్ప‌కుండా మీ అందరికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

ఈ చిత్రానికి
రచన. ద‌ర్శ‌క‌త్వం: లక్ష్మీకాంత్ చెన్నా,
నిర్మాత‌: బ‌ల్‌దేవ్‌సింగ్‌, నీలిమ. టి,
సినిమాటోగ్రఫీ: సజీష్ రాజేంద్రన్, న‌రేష్ రానా,
సంగీతం: నరేష్ కుమారన్,
ఎడిట‌ర్: ప‌్ర‌వీణ్ పూడి,
ఆర్ట్‌: సుప్రియ బ‌ట్టెపటి,
డైలాగ్స్‌: స‌ంతోష్ హ‌ర్ష‌, కార్తిక్ అర్జున్‌, క‌ల్లి క‌ళ్యాణ్‌,
లిరిక్స్‌: పూర్ణాచారి, గాంధి,
పిఆర్ఒ: వ‌ంశీ – శేఖ‌ర్‌.

- Advertisement -