శేరిలింగం పల్లి జోన్ మల్కం చెరువు, గచ్చిబౌలి నుండి కొండాపూర్ వరకు చేపట్టిన రెండో దశ శిల్పా లే ఔట్ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు కమిషనర్ ఆర్ వి కర్ణన్. హెచ్ సిటి ప్రాజెక్ట్ ద్వారా ఖజాగూడ చౌరస్తా వద్ద చేపట్టనున్న ఫ్లై ఓవర్ అండర్ పాస్ స్తల పరిశీలన చేశారు కమిషనర్. మల్కం చెరువు లో శానిటేషన్, కుక్కల బెడద, పై కమిషనర్ కు ఫిర్యాదు చేశారు వాకర్స్.
వాకర్స్ ఇబ్బంది లేకుండా నిర్వాహకులు తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు కమిషనర్. చెరువు లో స్టార్మ్ డ్రైన్ వాటర్ ఎక్కడ నుండి వస్తుందని అధికారులను అడిగారు కమిషనర్. దుర్గం చెరువు నుండి, ఇళ్లనుండి స్టార్మ్ వాటర్ వస్తున్నట్లు కమిషనర్ కు వివరించారు అధికారులు.
స్టార్మ్ వాటర్ చెరువులో రాకుండా ప చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయగా శిల్పా లే ఔట్ రెండో ఫేస్ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు కమిషనర్. ఫ్లై ఓవర్ పనులను ఈ నెల చివరికి పూర్తిచేయాలని ఆదేశించారు. భూసేకరణ పూర్తిచేస్తే సర్వీస్ రోడ్డు కూడా పూర్తవుతుందని కమిషనర్ కు తెలిపారు ప్రాజెక్టు ఇంజనీర్లు.భూసేకరణ పక్రియ పూర్తికి చర్యలు తీసుకోవాలని జోనల్ కమీషనర్ కు ఆదేశాలు ఇచ్చారు.
Also Read:జాజికాయ పొడితో ఆరోగ్యం!

