కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..

144
gas
- Advertisement -

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కాస్త రిలీఫ్. 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్‌పై రూ.135 త‌గ్గించారు. నేటి నుండి తగ్గిన ధర అమల్లోకి రానుంది. ప్రస్తుతం మార్కెట్లో 19 కేజీల సిలిండ‌ర్ రూ.2219కు ల‌భించ‌నున్న‌ది. నిన్న‌టి వ‌ర‌కు ఈ సిలిండ‌ర్ ధ‌ర ఢిల్లీలో రూ.2354గా ఉండేది.

కోల్‌క‌తాలో రూ.2322, ముంబైలో రూ.2171, చెన్నైలో రూ.2373కు ల‌భించ‌నున్న‌ది. మే 19వ తేదీన డొమెస్టిక్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎల్పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను చివ‌రిసారి పెంచిన విష‌యం తెలిసిందే. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధ‌ర‌ల‌ను నెల‌లో రెండుసార్లు ప్ర‌క‌టిస్తారు.

- Advertisement -