కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతం- కేటీఆర్‌

875
ktr
- Advertisement -

ప్రభుత్వ విభాగాలను కంమాండ్ కంట్రోల్ సెంటర్‌కు మరికొద్ది రోజుల్లో అనుసంధానం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ లోని బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 17 అంతస్థుల్లో నిర్మించిన ఈ సెంటర్ నుంచి హైదరాబాద్ లోని అణువణువునూ చూడవచ్చు. ప్రతి వీధిలోనూ నిఘాను పెట్టవచ్చు. ఇండియాలోనే తొలిసారిగా ఈ తరహా సెంటర్ తెలంగాణలో ఏర్పాటైంది.

నగరంలో ఇలాంటి నిర్మాణం చేపట్టడంతో శాంతి భద్రతలను శరవేగంగా కాపాడే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. ఇప్పటికే నేర శోధనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. అనేక అత్యాధునిక నేరపరిశోధన విభాగాలు, సమాచార వ్యవస్థ తో పాటు అనేక పరిశోధనావిభాగాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై నేరాల అదుపు, పరిశోధన వేగవంతంచేసే వ్యవస్థ ఏర్పకానుంది. కదలికలను పసికట్టి ముందస్తు చెర్యలు తీసుకునే వ్యవస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేయడం విశేషం.

ఇక ఈ భవంతి నిర్మాణం పూర్తయిందని తెలుపుతూ, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా నిర్మితమైన అద్భుత భవంతి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

Ain’t that a majestic sight! Hon’ble CM’s brainchild; the command & control centre to be unveiled soon in Hyderabad. I am sure this is one of its kind in India..

- Advertisement -