తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కర్త, రూపకర్త డీజీపీ మహేందర్ రెడ్డినే అని సీఎం చెప్పారు. నిజం చెప్పాలంటే పొగడ్తలు నాకు అందించారు. కానీ ఈ పొగడ్తలకు అర్హులు మహేందర్ రెడ్డినే కేసీఆర్ స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాలన్న ఆలోచన వారిదే. మహేందర్ రెడ్డి ఆలోచన మేరకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాం. అనేక సందర్భాల్లో అనేక విషయాలు చర్చిస్తున్నప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
ఈ ఏడాది డిసెంబర్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ ఉంది. ఆయన ఏదో రూపంలో తెలంగాణకు సేవ చేస్తూనే ఉండాలి. ఒక వేళ డ్రస్సు మారినా ఆయన సేవ మాత్రం మారదు. ఏకే ఖాన్ మైనార్టీ వెల్ఫేర్ గురించి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడ అద్భుత ఫలితాలు వస్తున్నాయి. వారి సేవలు కూడా కొనసాగాలని కోరాను. మీ అందరి సహకారం, ప్రస్తుత పోలీసుల పని తీరు, ప్రజల యొక్క సహకారం గత 8 సంవత్సరాలుగా శాంతిభద్రతల నిలయంగా ముందుకు తీసుకుపోతున్నాం. భవిష్యత్‌లో కూడా శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.