ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన స్టార్‌ కమెడియన్‌..!

358
Sunil

టాలీవుడ్‌ నటుడు, కమెడియన్‌ సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సునీల్ ఆసుపత్రిలో చేరారనే వార్తతో సినీ వర్గాలు, అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో సునీల్ స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగానే ఆసుపత్రిలో చేరానని ఆయన చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సునీల్‌ కోరారు. వైద్య పరీక్షలను నిర్వహించిన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.