కల్నల్‌ సంతోష్ అంత్యక్రియలకు ఏర్పాట్లు..

317
Colonel Santosh
- Advertisement -

సూర్యాపేట పక్కనే ఉన్న కేసరం గ్రామంలోని కల్నల్‌ సంతోష్ బాబు వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలుకు సంభందించి ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్సీ భాస్కరన్, ఆర్మీ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్,ఎస్పీ మీడియాతో మాట్లాడారు.

కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మీ,ప్రభుత్వ,అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు జరుగుతాయని అన్నారు. ఆర్మీ మేజర్లు, ఉన్నతాధికారులు ఈ అంత్యక్రియలుల్లో పాల్గొంటారు. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు సూర్యాపేటకు సంతోష్ బాబు పార్ధీవదేహం చేరుకుంటుంది కలెక్టర్‌ తెలిపారు.

ఎస్పీ భాస్కరన్ మాట్లాడుతూ.. రేపు జరిగే అంత్యక్రియలులకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసాము. కల్నల్‌ సంతోష్ బాబు కడసారి చూసేందుకు వచ్చే వారు భౌతిక దూరం పాటించాలి. ప్రజలు సంయమనం పాటించాలన్నారు.

- Advertisement -