ఎక్కడున్నావురా కొడుకా…హృదయాన్ని కలిచివేసే పాట

339
santhosh song
- Advertisement -

గుండెల్ని పిండేసేలా కల్నల్ సంతోష్ పై పాట పాడిన నాగలక్ష్మి దేశం కోసం వీర మరణం పొందిన సూర్యపేట వాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబం శోఖ సంద్రంలో మునిగింది. కల్నల్ తల్లి గారైన అంజలి దేశం కోసం తన కొడుకు ప్రాణమివ్వడం ఆనందంగా ఉందని చెప్తోంది. కానీ ఓ తల్లిగా ఆమె బాధని ఎవరూ తీర్చలేరు. కల్నల్ కుటుంబానికి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సానుభూతి సందేశాలు పంపిస్తున్నారు.

ఇదిలా ఉండగా సూర్యపేట వాసులంతా సంతోష్ బాబు ఇంటి దగ్గరికి వచ్చి వారిని ఓదారుస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఇమామ్‌పేటకు చెందిన నాగలక్ష్మి అనే మహిళ మాత్రం ఓ తల్లిగా కంటతడి పెట్టుకుంటూ, మాటల్లో చెప్పలేని అంజలి గారి బాధను ‘ఎక్కడున్నావురా కొడుకా, నా గావురాల కొడుకా, రా..రా’ అంటూ ఓ పాట పాడి తన బాధని చెప్పడమే కాకుండా.. ఆ పాట విన్నవారందరి గుండెల్ని పిండేసి, కంటతడి పెట్టించింది.

- Advertisement -