పెరుగుతో పెద్ద పేగు క్యాన్సర్‌కు చెక్!

17
- Advertisement -

బలవర్ధకమైన ఆహారాల్లో పెరుగు ఒకటి. పెరుగు లేకుండా భోజ‌నం సంపూర్ణమైనట్లు అనిపించదు. రుచికి అద్భుతంగా ఉండే పెరుగు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యవంతంగా ఉండటానికి దోహదం చేస్తుంది. సులభంగా జీర్ణమయ్యే పెరుగు అన్ని వయసుల వారూ తీసుకోదగిన ఆహారం. ఆరోగ్యానికి పెరుగు ఎంతగా ఉపయోగపడుతుందో చర్మ సౌందర్య పరిరక్షణలోనూ పెరుగు అంతే మేలుచేస్తుంది.

రోజువారీ ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల ప్రమాదకర క్యాన్సర్​ ముప్పును కూడా అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు. హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మాస్ జనరల్ బ్రిఘం పరిశోధకులు సంయుక్తంగా చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

పేగుల్లోని బ్యాక్టీరియా సమతులంగా ఉండటానికి పెరుగులోని బ్యాక్టీరియా తోడ్పడటం వల్ల క్యాన్సర్‌ ముప్పు తగ్గటానికి వీలవుతోందని భావిస్తున్నారు. సుమారు 3 దశాబ్దాలుగా లక్షా 50వేల మందికి పైగా వ్యక్తుల నుంచి డేటాను పరిశోధకులు విశ్లేషించారు. అలాగేపెరుగులోని కాల్షియం ఎముకల బలాన్ని, దృఢత్వాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని అంటున్నారు.

పెరుగులోని ప్రోబయోటిక్స్ – మలబద్ధకం, అతిసార వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని వివరిస్తున్నారు.

NOTE :ఈ ఆరోగ్య సమాచారం పాటించే ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

- Advertisement -