గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన పెద్దపల్లి కలెక్టర్..

869
Collector Devasena
- Advertisement -

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఆయన తన ఇంటి ఆవరణలో మొక్కలు నాట్టారు. అనంతరం ఆయన మరోముగ్గురికి ఈ ఛాలెంజ్‌ను విసిరారు. గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనవలసిందిగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేనను ట్వీటర్ వేదికగా ఆయన కోరగా దాన్ని స్వీకరిస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ దేవసేన మొక్కలు నాటారు.

Collector Devasena

అనంతరం జేసీ వనజాదేవి, జిల్లా ఇంఛార్జి డిఆర్ఒ నరసింహమూర్తి, పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు ఉపేందర్ రెడ్డి,నగేష్ లను గ్రీన్ చాలెంజ్ స్వీకరించవలసిందిగా కలెక్టర్ శ్రీదేవసేన కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్య సాధనలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోందని.. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాలని కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు.

- Advertisement -