తెలంగాణలో చలి…పులి

2
- Advertisement -

రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. రాత్రి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలకు చలికాలం కష్టాలు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనడపటంతో వర్షాలు కురిసే అవకాశం తక్కువేనని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో చల్లని గాలులు వీస్తున్నాయి… దీనివల్ల చలి క్రమంగా పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం అయిన వెంటనే చలికి తీవ్రత పెరిగి, కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోతున్నాయి

. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మారుతున్న వాతావరణానికి తగినట్లుగా తమ దుస్తులను ఎంచుకోవాలని, అవసరమైతే ఆహార అలవాట్లలో మార్పులు చేయాలని సూచిస్తున్నారు.

Also Read:గ్రేటర్‌లో ఫ్లై ఓవర్‌ల నిర్మాణం వేగవంతం

- Advertisement -