తెలుగు రాష్ట్రాల్లో చలి – పులి!

1
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు మామూలుగానే ఉంటున్న రాత్రివేళ చలి అధికంగా ఉంటోంది. బంగాళాఖాతంలో దక్షిణం, ఉత్తరాన రెండు ఆవర్తనాలు ఉండగా వాటి ప్రభావం ఏపీ, తెలంగాణలపై ప్రస్తుతానికి లేదన్నారు.

ఈనెల 26 లేదా 27 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. దాని ప్రభావంతో రాయలసీమ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు 2, 3 డిగ్రీలు తగ్గుతాయని చెప్పారు.

సాయంత్రం, రాత్రి, ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. ఆయా ఏరియాల్లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.

Also Read:కేసీఆర్ పేరుతో సినిమా గొప్ప విషయం: హరీశ్‌

- Advertisement -