తెలంగాణను వణికిస్తున్న చలి పులి

519
Cold wave conditions sweep Telangana
- Advertisement -

తెలంగాణను చలి వణికిస్తోంది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. నాలుగైదు రోజులుగా చలితీవ్రత పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. రాత్రి వేళ్లలో కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా ఐదు డిగ్రీలకు పడిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారు.

రానున్న ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేవారు ముఖాలకు, చేతులకు మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. తగ్గిన ఉష్ణోగ్రతలతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.  చలి బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, రోగులు, పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Cold wave conditions sweep Telangana
ఆదిలాబాద్ జిల్లాను మంచుదుప్పటి కప్పేసి కనిష్ట ఉష్ణోగ్రతలతో వణికిస్తోంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు.డిసెంబర్‌లో మొదలు కానున్న చలి తీవ్రత నవంబర్‌లోనే చుక్కలు చూపించడంతో భయాందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే జనవరి వచ్చేసరికి మంచు తీవ్రత ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళనకు గురవుతున్నారు.

- Advertisement -