హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత పెరుగుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతూ ప్రజలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చలిగాలి అదనంగా వీచడంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4–6 డిగ్రీలు తగ్గాయి. రానున్న ఐదు రోజులపాటు ఇదే ధోరణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో మోయినాబాద్ 5.4°Cతో అవుట్‌స్కర్ట్స్‌లో చలికి కేంద్ర బిందువుగా మారింది. నగరంలోని HCU–శేర్లింగంపల్లి 6.3°C, ఇబ్రాహీంపట్నం 6.3°C, మౌలాలి 7.1°C, రాజేంద్రనగర్ 7.7°C ప్రాంతాల్లో తీవ్ర చలి నమోదైంది. శివరాంపల్లి, అల్వాల్, గచ్చిబౌలి, మాచా బొల్లారం వంటి ప్రాంతాల్లో 8.8°C నుంచి 9.3°C మధ్య ఉష్ణోగ్రత పడిపోయింది.
నగర మధ్య ప్రాంతాలు కూడా చలికి అతీతం కాలేదు. బహదూర్‌పురా, జీడిమెట్ల, బేగంపేట, బీహెచ్ఈఎల్, నాగోల్, కార్వాన్, ఎల్బీ స్టేడియం ప్రాంతాల్లో 10°C నుంచి 11.6°C మధ్య రికార్డు అయ్యాయి. మల్కాజిగిరి, షేక్‌పేట్, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, హయత్‌నగర్, ముషీరాబాద్, అట్టాపూర్ ప్రాంతాల్లో 11.7°C నుంచి 13°C వరకు నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతలు ఇలా వరుసగా తగ్గుతుండటంతో హైదరాబాద్ వాసులు ఉదయం, రాత్రి వేళల్లో తీవ్ర చలిని అనుభవిస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, రాబోయే రోజుల్లో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.
Also Read:మంత్రి కొండాపై నాన్ బెయిలబుల్ వారెంట్

