ప్రస్తుత సమాజంలో ప్రధానంగా చాలామంది జలుబు సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇందుకు ఏవోవో మందులు వాడుతుంటారు. కానీ ఇంట్లోనే సామాన్యంగా దొరికే చిన్న చిన్న వాటితోనే జలుబును తగ్గించుకోవచ్చు. జలుబును తగ్గించడంలో తులసి చాలా బాగా పనిచేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పును కలపాలి. ఇది నమిలి మింగాలి. తులసి టీ తాగినా కూడా జలుబును తగ్గించుకోవచ్చు.
వేడిపాలల్లో చిటికెడు పసుపును వేసికుని గాలి. రాత్రి పడుకొనే ముందు తాగితే ఉపయోగం. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క..మారి దాల్చిం చెక్క వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి దీనికి కొద్దిగా తేనేను కలిపి త్రాగితే మంచిది. ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వెంచుకుని తినాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది.తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి.
Also Read:35-చిన్న కథ కాదు..లెక్కల మాస్టారుగా ప్రియదర్శి