గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న కాగ్నిజెంట్ సెంటర్‌హెడ్ ప్రశాంత్

470
green chalenge
- Advertisement -

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా సైబారబాద్ సీపీ సజ్జనార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు కాగ్నిజెంట్ సెంటర్ హెడ్ ప్రశాంత్ నందెళ్ల. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పర్యావరణ పరిరక్షణకు కాగ్నిజెంట్ కట్టుబడి ఉందని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

తమ సంస్ధలోని ఉద్యోగులందరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని . ఇప్పటివరకు తమ క్యాంపస్‌లో 300కి పైగా మొక్కలు నాటామని చెప్పారు.. పర్యావరణ హితం, మానవాళి మనుగడ కోసం ప్రతీఒక్కరూ మొక్కలను నాటలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం అనేది ఒక నిరంతర ప్రక్రియ కావాలన్నారు. తనను ఈ ఉద్యమంలో భాగస్వాములు చేసినందుకు సజ్జనార్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా తన సహ ఉద్యోగులు సిద్దార్ధ్ మహేశ్వరి,చింత సుబ్రమణ్యం,అనుప్‌లకు గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చిన ప్రశాంత్ మొక్కలు నాటాలని కోరారు.

green chalenge

- Advertisement -