ఐఐటీ హైదరాబాద్‌తో బొగ్గు, గనుల శాఖ ఒప్పందం

15
- Advertisement -

ఐఐటీ హైదరాబాద్ తో ఒప్పందం కుదుర్చుకుందిన్న బొగ్గు, గనుల శాఖ. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ చేసింది. ఐఐటీ హైదరాబాద్‌లో రూ.98 కోట్లతో సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ & నెట్ జీరో (CLEANZ) పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు.. కోలిండియా, IIT (HYD) మధ్య ఒప్పందం కుదిరింది.

బొగ్గు రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు, CMPDI (సెంట్రల్ మైన్ ప్లానింగ్ & డిజైన్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్) కింద స్వతంత్ర R&D వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆలోచన.

ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన కిషన్ రెడ్డి.. దేశంలో బొగ్గు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోందన్నారు. అన్ని రంగాల్లో, భారత దేశ అభివృద్ధిలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోంది… 72 శాతం విద్యుత్ మన దేశంలో బొగ్గు ద్వారానే ఉత్పత్తి చేసుకుంటున్నాం అన్నారు. స్టీలు, సిమెంట్, అల్యూమినియం, పేపర్, టెక్స్ టైల్, హెవీ ఇండస్ర్టీ రంగాల్లో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోంది. .. బొగ్గు ఉత్పత్తిలో భారత దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు.

బొగ్గు వినియోగంలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది… బొగ్గు నిల్వల విషయానికొస్తే 5వ స్థానంలో ఉందని తెలిపారు. కోలిండియా ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ… బొగ్గు ఉత్పత్తి ద్వారా అనేక రాష్ట్రాల్లో రెవెన్యూ అందజేస్తున్నాం అన్నారు. రైల్వే శాఖలో బొగ్గు రవాణా ద్వారా 50 శాతం ఆదాయం సమకూరుతోంది…
క్లీన్ కోల్ ఎనర్జీ, నెట్ జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా సరికొత్త సాంకేతికత అభివృద్ధి చేసేందుకు సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్ స్టిట్యూట్ ద్వారా పరిశోధన పెంచాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు.

ఇందులో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ కోల్ అండ్ ఎనర్జీ రీసెర్చ్ ను ఏర్పాటు చేశాం…భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలకు క్రిటికల్ మినరల్స్ అవసరం ఉంది.. క్రిటికల్ మినరల్స్ ను గుర్తించేందుకు ఐఐటీ హైదరాబాద్ కూడా సాంకేతిక సాయం అందజేస్తుందని తెలిపారు. కోల్ ఇండియా ఉద్యోగులకు కూడా సమీప భవిష్యత్తులో ఐఐటీ హైదరాబాద్ లో శిక్షణ అందించాలని చూస్తున్నాం అన్నారు.

Also Read:BRS:వరంగల్‌లో భారీ బహిరంగ సభ

- Advertisement -