బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సీఎం దిశా నిర్దేశం

32
- Advertisement -

దేశంలో  ఏ రాష్ట్రం ఎన్నడూ జరుపని విధంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ శాసనసభ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. దేశంలో ఏపార్టీ చేయని అద్భుతాలు విజయాలను ఈపదేండ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ సాధించిందని అన్నారు. ఇప్పటి వరకు చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు. అనేక రంగాల్లో సాధించిన విజయాలను పార్టీ కార్యకర్తలకు ప్రజలకు వివరించాలని తెలిపారు. తెలంగాణ పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసించిన సంగతిని ప్రజలకు తెలపాలని అన్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివిధ కార్పోరెషన్‌ల ఛైర్మన్‌లు హాజరయ్యారు.

Also Read: దశాబ్ధి ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌గా సీఎస్‌ శాంతికుమారి

- Advertisement -