శ్రీశైలం ఘటన చాలా దురదృష్టకరం ,తొమ్మిది మంది చనిపోయారు, చింతిస్తున్నాం అని తెలిపారు సీఎండీ ప్రభాకర్ రావు.7 ఇంజనీర్ లు,ఇద్దరు ఇతర వ్యక్తులు చనిపోవడం బాధాకరం.సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అక్కడకు నేను మంత్రి చేరుకున్నాము.వాళ్ళను కాపాడడం కోసం అనేక ప్రయత్నాలు చేశాం అన్నారు.
మా విద్యుత్ శాఖ మంత్రి, నేను మా అధికారులు రాత్రి మొత్తము రెస్క్యూ ఆపరేషన్ చేశాం కానీ మా డిపార్ట్మెంట్ తో కాలేదు వెంటనే ఎన్డి ఆర్ ఎఫ్ ,సి ఐ ఎస్ ఎఫ్ బృందాలను పిలిచాం .అందులో మొత్తము పవర్ పోయింది దీనితో లోపల అంధకారం అయింది.స్మోక్ తో అంత ఆక్సిజన్ లభించలేదు..చాలా ప్రయత్నాలు చేశాం ,స్మోక్ ను బయటకు పంపించేందుకు చేలా కష్టపడ్డారూ.ఆయిన దురదృష్టవశాత్తు వారు చనిపోయారు..అయిన వారిని కాపాడుకోలేకపోయాం అన్నారు.
అది ఆటోమేటిక్ ట్రిప్ కావాలి కానీ కాలేదు ఎందుకు ట్రిప్ కాలేదు అనేదానిపై కమిటీ వేశాం.ఎందుకు ఇలాంటి సమస్య వచ్చిందో తెలుసుకోవడానికి పని చేస్తున్నాం..పవర్ పోవడం తో వెంటిలేషన్ ఆగిపోయింది, దీనితో ఎమర్జెన్సీ వె కూడా తెరుచుకోలేదు.గత 30 రోజుల నుండి చాలా చక్కగా జరుగుతున్నాయి రోజుకు 128 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
పవర్ జనరేషన్ ఎక్కువ ఉన్నది అని ఆల్రెడీ ఆపేశాం.వస్తున్న ఆరోపణలు అవాస్తవం.గతంలో కూడా ఎన్టీపీసీ లో బాయిలర్ బ్లాస్ట్ అయింది దాదాపు 30 చనిపోయారు.తమిళనాడు లో కూడా జరిగింది దురదృష్టవశాత్తు మన దగ్గర కూడా జరిగింది దీనిపై కమిటీ వేశామ్.కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తారు అని తెలిపారు.ప్రభుత్వం నుండి ఇప్పటికే వాళ్లకు ఎక్స్ గ్రేషియా ఇచ్చము వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాం త్వరలోనే వాళ్ళ కుటుంబాలను కాలుస్తోం జెన్కో నుండి సహాయం అందజేస్తాం.రెండు యూనిట్స్ 15 రోజుల్లో పనిచేసేందుకు కృషి చేస్తున్నారు మా ఇంజనీర్ లు.దాదాపు రోజు 800 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరిగేది.
బయట నుండి ఎలాంటి వాటర్ లోపలికి వచ్చే ఛాన్స్ లేదు.ప్లాంట్ లోపలికి నీరు వచ్చేది లేదు ,ఎలాంటి ఇబ్బంది కూడా లేదు.సాగర్ లో కూడా నీటి ప్రవాహం ఉన్నది అక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.వర్షాలు ఎక్కువగా ఉండడం తో వ్యవసాయం కు డిమాండ్ తగ్గింది.ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సి ఐ డి కి ఆదేశించారు వాళ్ళ పని వాళ్ళు చేసి రిపోర్ట్ ఇస్తారు.మేము కూడా ఇంటర్నల్ కమిటీ వేశాము.ఇంకా లోపలికి పోవడానికి వీలు లేదు.ప్రయత్నాలు చేస్తున్నారు.ఇలాంటి సంఘటనలు జరిగిన రాష్ట్రాల్లో ఇంత ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు వారికి అండగా ఉంటాం అన్నారు.