- Advertisement -
దేశంలో రెండో సీఎంకు కరోనా పాజిటివ్ సోకింది. ఇప్పటికే కరోనాతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతుండగా తాజాగా కర్ణాటక సీఎం యెడీయూరప్పకు కరోనా పాజిటివ్ సోకింది.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆయన కరోనా వైరస్ పాజిటివ్‌గా పరీక్షించారు. వైద్యుల సిఫారసు మేరకు ముందు జాగ్రత్తగా నేను దవాఖానలో చేరాను. ఇటీవల నన్ను సంప్రదించిన వారంతా గమనించి, స్వీయ నిర్బంధంలో ఉండాలని అభ్యర్థిస్తున్నాను పేర్కొన్నారు.
ఆదివారం కర్ణాటకలో 5,532 కరోనా కేసులు నిర్ధారణ కాగా, 84 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1.34 లక్షల కేసులు పాజిటివ్‌గా ధ్రువీకరణ కాగా, మృతుల సంఖ్య 2,496కు చేరింది.
- Advertisement -