సినారె పార్థివదేహానికి కేసీఆర్ నివాళి

224
CM visits & pays rich tributes to C-NARE
CM visits & pays rich tributes to C-NARE
- Advertisement -

ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి పార్థివ దేహానికి కొద్ది సేపటి క్రితం సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సంధర్బంగా ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు కేసీఆర్. సీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. సినారె నివాసంలోని సినారె గదిని సీఎం సందర్శించారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. నగరం నడిబొడ్డున సినారె స్మారక మ్యూజియం, సాహితీ సమావేశ మందిరం ఏర్పాటు చేస్తామన్నారు.

తెలుగు ప్రజలు గొప్పగా చెప్పుకునే వ్యక్తి సినారె.. ఆయన సేవలు చిరస్థాయిలో గుర్తుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంత కీర్తించుకున్నా, పొగిడినా ఆయన సేవలు మరువలేనివి అని స్పష్టం చేశారు. సినారె అభిమానించిన సారసత్వ పరిషత్‌కు ప్రభుత్వం అండదండలు అందిస్తుందన్నారు. సినారె అంత్యక్రియల్లో కవులు, కళాకారులు, రచయితలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేవారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. సినారె సభ్యులకు దైర్యాన్ని, ఆత్మైస్థెర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

తెలంగాణలోని ఓ ప్రముఖ సంస్థకు లేదా ఓ యూనివర్సిటీకి సినారె పేరు పెడుతామని చెప్పారు. సినారె విశిష్టమైన సాహితీవేత్త అని తెలిపారు. సాహితీ మకుటంలో సినారె కలికితురాయి అని పేర్కొన్నారు. సినారె అంటే ఒక గ్లామర్ అని పేర్కొన్నారు. కవులకు గ్లామర్ ఉంటుందని నిరూపించిన వ్యక్తి సినారె అని అన్నారు. ఆది, అంత్య ప్రసాలకు గొప్ప నడక నేర్పింది సినారె అని చెప్పారు. సినారె అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో సినారె అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌కు సీఎం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.

- Advertisement -