భారతీరాజా త్వరగా కోలుకోవాలి: సీఎం స్టాలిన్

62
cm stalin
- Advertisement -

దర్శకుడు భారతీరాజా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు తమిళనాడు సీఎం స్టాలిన్. అనారోగ్య కారణాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు భారతీ రాజా. డాక్టర్ల సూచన మేరకు ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో భారతీరాజాను పరామర్శించారు స్టాలిన్. ఆయనతో పాటు పలువురు డీఎంకే నాయకులు, సినీ గీత రచయిత వైరముత్తు కూడా వెళ్లి పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా స్టాలిన్‌ ఆస్పత్రి వైద్యులకు ఫోన్‌ చేసి భారతీరాజా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన డిశ్చార్జ్ కావడంతో ఇంటికెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.

- Advertisement -