రసవర్తరంగా సాగుతున్న కర్ణాటక ఫలితాలలో అనూష్య సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి సిద్దరామయ్య పోటి చేసిన చాముండేశ్వరి నియోజక వర్గం లో అతను ఓటమి పాలయ్యారు. కర్ణాటకలో సిద్దరామయ్య రెండు స్ధానాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. చాముండేశ్వరి నియోజకవర్గం కాకుండా బాదామీ నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దిగాడు. చాముండేశ్వరి నియెజకవర్గంలో తనపై పోటీ చేసిన జేడీఎస్ అభ్యర్ధి దేవగౌడ 17వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చాముండేశ్వర లో ఓడిపోతాననే భయంతోనే సిద్దరామయ్య రెండు స్ధానాల్లో పోటీ చేశారు. ఇక సిద్ద రామయ్య పోటీచేసిన మరో నియోజక వర్గం బాదామీ లో స్వల్ప ఓట్ల తో ముందంజలో ఉన్నారు.
కాంగ్రెస్ సీఎం అభ్యర్ధియే ఓటమి పాలవడంతో కర్ణాటకలో కాంగ్రెస్ శ్రేణులు డీలా పడిపోయారు. కర్ణాటకలో బిజెపి అత్యధిక మెజార్టీతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో మళ్లీ తామే అధికారంలోకి వస్తారనుకున్న కాంగ్రేస్ నేతలకు ఇది పెద్ద షాక్ వార్త అని చెప్పుకొవాలి. ఇక సిద్దరామయ్య సోంత నియోజక వర్గం వరుణ నుంచి తను కుమారుడు యతీంద్రను బరిలోకి దింపాడు. వరుణ నియోజకవర్గంలో యతీంద్ర విజయం దిశగా దూసుకుపోతున్నాడు. ఇక బీజేపీ సీఎం అభ్యర్ధి యెడ్యూరప్ప పోటీ చేసిన షికారిపుర నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు.