ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలి:స్మితా సబర్వాల్

404
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో నిర్మిస్తున్న నిర్మాణాల చివరి పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా సోమవారం ఆమె కన్నెపల్లి పంప్ హౌస్ పంప్ హౌస్ సుందిళ్ల బ్యారేజీ లను పరిశీలించి అధికారులకు ఏజెన్సీలకు తగు సూచనలు చేశారు. కాలేశ్వరం పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన సీఎం కార్యదర్శిని జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మంథని లోని సిరిపురం వద్ద నిర్మించిన అన్నారం పంపుహౌస్ పనులను పరిశీలించి నీటిని ఎత్తిపోతల ఎందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సూచించారు.

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నదికి భారీ ఎత్తున 96000 క్యూసెక్కుల మేర వరద వస్తుందని, ఆ నీటిని ఉపయోగించే దిశగా ప్రణాళిక ప్రకారం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద క్రమపద్ధతిన మోటార్లను ఆన్ చేస్తున్నామని, ప్రస్తుతం కన్నెపల్లి వద్ద మూడు మోటార్లు నడుస్తున్నాయని, ప్రతి మోటర్ 2200 క్యూసెక్కుల మేర నీటిని ఎత్తిపోస్తుందని, వరద పరిస్థితులకు అనుగుణంగా మిగిలిన మోటర్ లను సైతం ఆన్ చేస్తామని అన్నారు. గ్రావిటీ కెనాల్ ద్వారా నీరు అన్నారం బ్యారేజీ చేరుకుంటుందని, ఇప్పటివరకు అన్నారం బ్యారేజీ వద్ద 1.5 టీఎంసీల నీరు చేరిందని, అన్నారం బ్యారేజీ లో సుమారు 4.1 టీఎంసీల నీరు చేరితే పంపింగ్ ప్రారంభించాల్సి ఉంటుంది అని, రెండు లేదా మూడు రోజులలో అన్నారం పంపుహౌస్ లో పంపింగ్ ప్రారంభించాలని , అన్నారం బ్యారేజీ నుండి నీటిని సుందిళ్ల బ్యారేజీ లో వేయాల్సి ఉంటుందని, సుందిళ్ల లో సైతం బ్యారేజి నిర్మాణం పూర్తి అయిందని దీనికి తగిన విధంగా పంపిన అవసరమైన నా చివరి పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని సీఎం కార్యదర్శి ఆదేశించారు.

CM Secretary Smitha Sabharwal

ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కాళేశ్వరం ద్వారా రైతులకు కొంతమేరకు ఉపశమనం కలిగిస్తూ సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి చాలా పట్టుదలగా ఉన్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా పనుల్లో వేగం పెంచుతూ, పకడ్బందీగా ఎత్తిపోతల ప్రక్రియ జరిగే విధంగా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. గత రికార్డుల ప్రకారం ప్రాణహిత నది వద్ద వరద అధిక సమయం ఉంటుందని, కావున పంపిన ప్రక్రియ నిరంతరం సాగుతుందని దానికి అవసరమైన విద్యుత్ పనులు సైతం పూర్తి చేశామని పగడ్బందీగా ఇలాంటి పొరపాటు లేకుండా నీటి పంపిణీ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సందుల నుండి నీటిని ఎల్లంపల్లికి తరలించాలని ఆ విధంగా సుందిళ్ల పంప్ హౌస్ పనులు వేగం పూర్తి చేయాలని అక్కడ మిగిలిన వాటిని త్వరగా జరిగేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన, జిల్లా సంయుక్త పాలనాధికారి వనజాదేవి, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

- Advertisement -